కేంద్ర సీఆర్‌ఎం బృందం పర్యటన
జయపురం: కేంద్ర కామన్ రివ్యూ మిషన్ టీమ్ (సీఆర్‌ఎం) జయపురంలో గురువారం పర్యటించింది. కొరాపుట్ జిల్లా కేంద్ర హాస్పిటల్‌ని సందర్శించింది. హెల్త్ కుటుంబ, కళ్యాణ విభాగ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయ ఆలీ రిజ్వీ, అడ్వైజర్ డాక్టర్ శశాంక్ కుమార్, కర్ణాటక రాష్ట్ర డాక్టర్ మధుసూదన సాయి, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ దీపా ఎలెన్, ఆర్థిక విశ్లేషణ నిపుణులు సత్యజిత్‌తో కూడిన కేంద్ర సీఆర్‌ఎం టీమ్ దాదాపు మూడు గంటలు జిల్లా కేంద్ర హాస్పిటల్‌ను సందర్శించారు. హాస్పిటల్‌లో అన్ని విభాగాలు, ఆపరేషన్ యూనిట్, హాస్పిటల్ పరిసర ప్రాంతాలు, నూతన భవనాలు పరిశీలించారు. వీరితో కొరాపుట్ జిల్లా ప్రధాన వైద్యాధికారి (సీడీఎంఓ)డాక్టర్ వరద కుమార్ మిశ్ర, జిల్లా చికిత్సా కేంఽద్ర అధికారి డాక్టర్ రవీంద్రనాథ్ మిశ్ర, హాస్పిటల్ మేనేజర్ రూపసి నాయక్ తదితరులు హాస్పిటల్‌లో గల సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. టీమ్ రెండు జట్లుగా ఏర్పడి ఒక జట్టు జిల్లా కేంద్ర హాస్పిటల్‌ను, రెండో జట్టు జయపురం పట్టణంలో గల సబ్‌డివిజన్ హాస్పిటల్, జయపురం సబ్‌డివిజన్‌లో గల కమ్యూనిటీ హాస్పిటల్, ప్రాథమిక వైద్య కేంద్రాలను సందర్శించి వాటి పరిస్థితులపై అధ్యయనం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment