రహదారి నిర్మించాలని ఆందోళన నేడు
రాయగడ:
జిల్లాలోని మునిగుడ ప్రధాన రహదారి వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మూడు కూడళ్ల వద్ద భూతల రహదారిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ మునిగుడ ప్రగతి మంచ్ ఆందోళన చేపట్టనుంది. నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో తరచూ రైల్వే ట్రాక్ వద్ద గేటు వేస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఈ సమస్యను నివారించే విధంగా సంబంధిత శాఖ అధికారులకు భూతల రహదారిని ఏర్పాటు చేయాల్సిందిగా పలుమార్లు స్థానికులు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రగతి మంచ్ అధ్యక్షుడు సీహెచ్ గణేశ్వరరావు, కార్యదర్శి సింహాచల్ పండాలు తెలిపారు. బుధవారం సాయంత్రం ఈ మేరకు నిర్వహించిన ఒక సమావేశంలో మునిగుడ ప్రగతి మంచ్‌కు చెందిన ప్రతినిధులు, సభ్యులు పాల్గొని ఆందోళన చేపట్టేందుకు తీర్మానించామని వివరించారు. ప్రగతి మంచ్ తరుపున చేపట్టనున్న ఈ ఆందోళనలో భాగంగా శుక్రవారం ఉదయం జగన్నాథ మందిరం నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్ వరకు చేరుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment