కొరాపుట్‌లో ఈస్టుకోస్టు జీఎం పర్యటన నేడు
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ పంక్వా ల్ కొరాపుట్ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ప్రత్యేక రైలులో బయల్దేరి ఉదయం 8 గంటలకు కొరాపుట్ చేరనున్నారు. కొరాపుట్–రాయగడల మధ్య నిర్మా ణం జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనుల పురోగ తిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు బయల్దేరి రాయగడ వెళ్తారు. రైల్వేలో జీఎం స్థాయి ఉన్నతాధికారి ఈ మార్గం వైపు వస్తుండడంతో రైల్వే వర్గాల్లో అప్రమత్తత నెలకొంది.
విచారణకు ఆదేశం
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి మోహిపోదర్, కుమార్‌పల్లి పంచాయతీలో గిరిజనుల కు అడవి భూముల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయులను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కన్ను చరణ్ స్వయి వసూలు చేశాడని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేర కు కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. తమకు పట్టాలు ఇప్పించాలని, లేదంటే తిరిగి తమ డబ్బులు అందజేయా లని కోరారు. అయితే ఈ విషయంపై కలెక్టర్ స్పందించి రెవెన్యూ అధికారిపై విచారణకు ఏడీఎం, తహసీల్దార్లకు ఆదేశించారు. విచారణ లో అభియోగాలు రుజువైతే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
నో ఫ్లై జోన్ ప్రకటన
భువనేశ్వర్: నగరంలోని పలుచోట్ల నో ఫ్లై జోన్, నో డ్రోన్ జోను ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని జంట నగరాల పోలీసు కమిషనరేటు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమలు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో పోలీసు డైరెక్టరు జనరల్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి రాష్ట్రానికి విచ్చేయనున్నారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ పోర్టు ప్రాంతం, రాజ్ భవన్ ప్రాంతం, సభా ప్రాంగణం లోక్ సేవా భవన్, ఐపీఎస్ మెస్, మైత్రి విహార్, బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్, రాజ్ భవన్ నుంచి లోక్ సేవా భవన్, ఎయిర్ పోర్టు నుంచి ఐపీఎస్ మెస్, మైత్రి విహార్ మార్గాల్లో దారి పొడవునా నో ఫ్‌లై, నో డ్రోన్ జోను ప్రాంతాలుగా ప్రకటించినట్లు జంట నగరాల పోలీసు కమిషనరేటు ప్రధాన కార్యాలయం డీసీపీ పేర్కొన్నారు.
జయరామ్‌కు కర్మవీర చక్ర అవార్డు
సంతబొమ్మాళి: మండలంలోని రుంకు హనుమంతుపురం గ్రామానికి చెందిన పోలాకి జయరామ్ కర్మవీర చక్ర అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షాలాది మంది విద్యార్థుల జీవితాల్లో జీవన ప్రమాణాల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఢిల్లీలో నవంబర్ 26న హార్డ్‌ఫర్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ప్రిన్పెస్ ప్రాన్క్రోసి స్టూడిజా ఈ అవార్డును ప్రదానం చేశారు. కర్మవీరచ క్ర గ్లోబల్ యూత్ లీడర్స్ ఫోలోగా సైతం గుర్తింపు ఇచ్చారు. జయరామ్ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్
విజేతగా దుప్పలవలస
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శన విజయవాడలో ఈ నెల 25న నిర్వహించారు. ఇందులో దుప్పలవలస గురుకుల పాఠశాల విద్యార్థులు ‘హోం పేషెంట్స్ ఫుల్ కేర్ వీల్ చైర్’ అనే ప్రాజెక్టును ప్రదర్శించారు. 7వ తరగతి విద్యార్థి మనోజ్, ఇంటర్మీడియట్ విద్యార్థి కార్తీక్ దీనిని రూపొందించగా.. పీజీటీ జి.త్రినాథరావు గైడ్‌గా వ్యవహరిం చారు. 190 పాఠశాలల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టుకే ప్రథమ స్థానం లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా కో–ఆర్డినేటర్ బాలాజీ నాయక్, ప్రిన్సిపాల్ బి.బుచ్చిరాజు బుధవారం అభినందించారు.
బెల్లం ఊట ధ్వంసం
మెళియాపుట్టి: నాటుసారా తయారీ క్రయ విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్ హెచ్చరించారు. బుధవారం మెళియాపుట్టి మండలం రింపి గ్రామంలో టెక్కలి, నరసన్నపేట, ఎకై ్సజ్ సిబ్బంది సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 900 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టెక్కలి, నరసన్నపేట ఎస్సైలు సత్యనారాయణమూర్తి, గురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment