సేవాభావంతో ముందుకు కొనసాగాలి
రాయగడ: సమాజ హితం కోసం ఏర్పడే సేవా సంస్థలు సేవా భావంతో ముందుకు కొనసాగాలని బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షురాలు సర్మిష్టా పాఢి అన్నారు. స్థానిక సాయిప్రియనగర్‌లోని సాయిప్రియ వెల్ఫేర్ ట్రస్టు 12వ వార్షితోత్సవం ట్రస్టు కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పాఢి మాట్లాడుతూ.. సేవా ధృక్పథంతో ఏర్పాటైన ఇటువంటి సంస్థల ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతోందన్నారు. ట్రస్టు కార్యదర్శి దయానిధి ఖడంగా మాట్లాడుతూ.. సాయిప్రియ నగర్‌లోని వివిధ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించామని అన్నారు. ట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అంతకు ముందు పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి . అలాగే వివిధ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ సమాజ సేవకురాలు సంధ్యారాణి దొలాయ, ట్రస్ట్ సభ్యులు లాడి మురళి స్వప్నా కుమారి రథో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment