మో బస్సులో అగ్నిప్రమాదం
భువనేశ్వర్: కటక్ నగరం ఖపూరియా స్క్వేర్‌లో మో బస్సు మంటల్లో చిక్కుకుంది. రాజధాని ప్రాంత నగర ట్రాన్స్‌పోర్ట్ ఈ ఘటనపై వాస్తవాల్ని నిర్ధారించేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీ దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక దాఖలు చేస్తుంది. ఈ దర్యాప్తు బృందంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, క్రట్ ఆపరేషన్స్, డిపో మేనేజర్, బస్సు ఆపరేటరుని సభ్యులుగా నియమించారు. క్రట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల నాయక్, సంజయ్ బిస్వాల్ సహా ఇతర అధికారులు ఘటనా స్థలం సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రాజధాని భువనేశ్వర్ నుంచి సిల్వర్ సిటీ కటక్ వెళ్తుండగా ఖపూరియా స్క్వేర్ వద్ద మో బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. జన సందోహిత ఖపురియా–మధుపట్నా కూడలి ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద సమయంలో బస్సులో యాత్రికులు లేనందున ఘోర ప్రమాదం తప్పిందని విచారణ బృందం అభిప్రాయపడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తొలుత బస్సు ఇంజిన్ నుంచి రగిలిన మంటలు కాసేపట్లో బస్సు అంతా విస్తరించాయి. స్థానికుల సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి మంటలు నివారించింది.
Comments
Please login to add a commentAdd a comment