బస్సు బోల్తా: ఒకరు దుర్మరణం
భువనేశ్వర్: భద్రక్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రహదారి పక్కన నిలబడి ఉన్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. బస్సులోని 10 మంది పైబడి ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో సుమారు 7 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రక్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. స్థానికులు చొరవ కల్పించుకుని మిగిలిన ప్రయాణికుల్ని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషాద సంఘటన భద్రక్ జిల్లా జగులిపొదా గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. బొంతా ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతి వేగం ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షుల ఆరోపిస్తున్నారు. భద్రక్ నుంచి బొంతా వైపు అతి వేగంగా దూసుకు పోతున్న బస్సు అదుపు తప్పి ప్రయాణికులతో బోల్తా పడింది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న అమాయకుని ప్రాణాల్ని బలిగొంది.
Comments
Please login to add a commentAdd a comment