అన్నదాత అవస్థలు
ఖరీఫ్ పంట కోతల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇదీ క్రమం
మొదటి వరుసలో దివ్యాంగులు, రెండో వరుస గుండా పిల్లలతో ఉన్న మహిళలు, మూడో వరుసలో వయో వృద్ధులు, మిగిలిన మూడు వరుసల్లో పురుషులను దర్శనం కోసం అనుమతిస్తారు. ఈ మూడు వరుసల గుండా అభీష్టం మేరకు మహిళలు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తారు. శ్రీమందిరం నాట్య మండపంలో దర్శనం కోసం వరుసల ఏర్పాటు కార్యకలాపాల్ని ఒడిశా వంతెన నిర్మాణ కార్పొరేషన్(ఓబీసీసీ) ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కలప చెక్కలతో తాత్కాలిక బారికేడ్లుతో కూడిన వరుసలు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలు వంటి సందర్భాల్లో వీటి అడ్డు తొలగించేందుకు వీలుగా ఈ ఏర్పాటు ప్రతిపాదించారు. ఈ మేరకు శ్రీమందిరం పాలక మండలి అధ్యక్షుడు పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్ దేవ్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓబీసీసీ అధికారులతో సవివరంగా చర్చలు జరిపినట్లు శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలిపారు. దర్శనం కోసం ప్రధాన ఆలయంలో తాత్కాలిక బారికేడ్లతో కలప చెక్కల వరుసల ఏర్పాటు పురస్కరించుకుని స్వామి సేవాయత్‌ల వర్గం ఛొత్తీషా నియోగులతో సంప్రదించిన మేరకు ప్రణాళిక ఖరారు చేసి అమలు చేయడం జరుగుతుందన్నారు. మరోవైపు గరుడ స్తంభం నుంచి దర్శనం కోరుకునే వారి కోసం ప్రత్యేక ర్యాంపును నిర్మాణం యోచిస్తున్నారు. ఈ నిర్మాణం భోగ మండపం సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని పాలక మండలి అభిప్రాయపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment