ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్‌లో పవిత్రత పరిరక్షణ, భద్రత వ్యవస్థను మెరుగుపరిచేందుకు శ్రీజగన్నాథ ఆలయం అధికార వర్గం 20 మంది విశ్రాంత ఆర్మీ సిబ్బందిని నియమించింది. మాజీ సైనిక సిబ్బంది సాధా రణ దుస్తులు ధరించి భద్రత, పవిత్రత పరిరక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. నిత్యం 2 విడతల్లో వీరు విధుల్లో పాల్గొంటారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టులలో పని చేస్తారు. వారి ప్రాథమిక లక్ష్యం ఆనంద బజారులో తాజా మహా ప్రసాదం అమ్మకం, సేవకుల ప్రవర్తన పర్యవేక్షణ మరియు పరిసరాల పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల్ని విరామ సైనిక సిబ్బంది నిర్వహిస్తారు. అన్న మహా ప్రసాదం మరియు పొడి మహా ప్రసాదం అమ్మకంలో పాల్గొన్న సేవకులు తమ విధుల్లో సహాయం చేయడానికి ఒక్కొక్కరిని సహాయకుడిని నియమించుకోవడానికి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment