విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
జయపురం: విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ అన్నారు. జయపురం సబ్ డివిజ న్ బొయిపరిగుడ ఆదర్శ విద్యాలయ వార్శికోత్సవంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. విద్యా సంవత్సరం ఉత్తమ విద్యార్థిగా నిలిచిన ఆయుష్ స్వైను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జయపురం విక్రమదేవ్ వర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్, బొయిపరిగుడ బీడీవో అభిమన్యు కవి శతపతి, బ్లాక్ విద్యాధికారి సుకాంత కర్తామీ, సమితి అధ్యక్షుడు ప్రశాంత కుమార్ గుప్త, నవరంగపూర్ ఎంపీ ప్రతినిధి నరేంద్ర కందాలియ, కొరాపుట్ నోడల్ విద్యాలయ అధ్యక్షుడు శొశాంఖ శేఖర చౌదరి, పాఠశాల అధ్యక్షుడు శశిభూషణ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment