సమాజ చైతన్యమే సినిమాల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమాజ చైతన్యమే సినిమాల లక్ష్యం

Published Tue, Dec 31 2024 1:51 AM | Last Updated on Tue, Dec 31 2024 1:51 AM

సమాజ

సమాజ చైతన్యమే సినిమాల లక్ష్యం

జయపురం: సమాజ చైతన్యమే సినిమాల లక్ష్యం కావాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బహిణీపతి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక జ్యోతి కల్యాణ మండపంలో జరిగిన బజరంగ క్రియేషన్‌ 7 వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భజరంగ క్రియేషన్‌ చైర్మన్‌, దర్శకులు ఐ.గోపాల పట్నాయిక్‌ అద్యక్షతన జరిగిన వార్షికోత్సవం ఆయన ప్రసంగిస్తూ స్థానిక కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా గోపాల పట్నాయిక్‌ మాట్లాడుతూ ఇంతవరకు భజరంగ క్రియేషన్‌ బ్యానర్‌పై తెలుగు, ఒరియా, హిందీ, దేశీయ భాషల్లో 32 చిత్రాలు తీశామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ మీడియ ప్రతినిధులు టి.గౌరీశంకర్‌, మనోజ్‌ దాస్‌, పద్మనాభలను సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సమాజ చైతన్యమే సినిమాల లక్ష్యం 1
1/1

సమాజ చైతన్యమే సినిమాల లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement