పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు
సీతానగరం: మండలంలోని పంట పొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులపై గురువారం పిచ్చికుక్క దాడిచేసి గాయపర్చడం వలన క్షతగాత్రులు పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్క ఎక్కడనుంచి వచ్చిందో తెలియదు కానీ తామరఖండి, బళ్లకృష్ణాపురం, బక్కుపేట గ్రామాల మధ్య ఉన్న పొలాల్లో ఎవరి మడులలో వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చి గాయపర్చింది. ఈ నేపథ్యంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు పిచ్చికుక్క దాడిలో తామరఖండి గ్రామానికి చెందిన వై శ్రీనివాసరావు, బళ్లకృష్ణాపురం గ్రామానికి చెందిన జి శ్రీనివాసరావు,బక్కుపేట గ్రామానికి చెందిన తేలు మోక్షిత గాయాలపాలయ్యారు. బాధితులకు స్థానిక పీహెచ్‌సీలో డాక్టర్ పావని వైద్యసేవలందించి మెరుగైన వైద్యం కోసం జిల్లాకేంద్రాస్పత్రికి రిఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment