డైరీ ఆవిష్కరణ
పార్వతీపురం: నూతన సంవత్సరం సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్, ఏపీ ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ ఎంప్లాయీస్‌కు చెందిన ఉద్యోగ సంఘాల డైరీని, క్యాలెండర్లను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, డీజీ ప్రసాదరావు తదితరులు కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు చిత్తశుద్ధితో కృషిచేయాలని సూచించారు. జిల్లా సమగ్రాభివృది్‌ఝధకి ఉద్యోగులంతా సమష్టిగా తోడ్పాటును అందించాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఏపీజేఏసీ అమరావతి, రెవెన్యూ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, జనరల్ సెక్రటరీ డీజీ ప్రసాదరావు, జలవనరుల శాఖ రాష్ట్ర జనర ల్ సెక్రటరీ వి.గౌరునాయుడు, విశ్రాంత ఉద్యోగ సంఘం కార్యదర్శి ఎం. ధనుంజయనాయుడు, ఉపాధ్యక్షుడు డి.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
రామతీర్థం హుండీల ఆదాయం రూ.18.32లక్షలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు గురువారం చేపట్టారు. దేవస్థానం ఆవరణలో నిర్వహించిన హుండీల ఆదా యం లెక్కింపులో రూ.18,32,397 లభించిన ట్లు ఈఓ వై శ్రీనివాసరావు తెలిపారు. దేవాదా య శాఖ సహాయ కమిషనర్ శ్యామ్‌ప్రసాద్, త నిఖీదారు పద్మావతి హుండీల లెక్కింపును దగ్గరుండి పర్యవేక్షించగా విజయనగరం పైడిమాంబ సేవా సంఘం సభ్యులు హుండీల ఆదాయాన్ని లెక్కించారు. కార్యక్రమంలో పోలీస్, ఏపీజీవీబీ, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కమాండెంట్ మల్లికా గార్గ్
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ పోలీస్ ఆసోసియేషన్ 2025 ఏడాది నూతన క్యాలెండర్‌ను కమాండెంట్ మల్లికా గార్గ్ గురువారం ఆవిష్కరించారు. బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాలెండర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ సత్తిరాజు,అసిస్టెంట్‌లు, అధికారులు,సిబ్బంది, బెటాలియన్ సంఘం అధ్యక్షుడు మిత్తిరెడ్డి అప్పలనాయుడు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి మహిళా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ
● ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: స్టైపెండరీ మహిళా పోలీస్‌కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 3, 4, 6 తేదీల్లో పీఎంటీపీఈటీ పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన 3వ రోజు నిర్వహించిన రాత పరీక్షలకు 600 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 341 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారన్నారు. నియామకాల ప్రక్రియ వేకువజామున 5 గంటల నుంచే ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో, పరీక్షలు సకాలంలో పూర్తయ్యాయని చెప్పారు. పోలీసు నియామకాల ప్రక్రియను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత స్వయంగా పర్యవేక్షించారు.
శంబర జాతరకు పక్కాగా ఏర్పాట్లు ఉండాలి
● కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: ఈనెల 27,28,29 తేదీలలో నిర్వహించే శంబర జాతరకు పక్కాగా ఏర్పా ట్లు ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికా రులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన శంబర పోలమాంబ జాతరను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని, మరుగుదొడ్ల నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాటుచేసే క్యూలు అత్యంత జాగరూకతతో ఏర్పాటుచేయాలని కోరారు. వైద్యశిబిరాలను, భక్తులు బట్టలు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment