హత్య కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ పోలీసు స్టేషన్ నకులగుడలో కొత్త సంవత్సరం దినాన జగన్నాథ్ మఝి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి తపశ్విణీ కుహార్ ఆదివారం పత్రికల వారికి వెల్లడించారు. అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా ఇద్దరు మేజర్లు అని వెల్లడించారు. ఆ ఇద్దరు నకులగుడ గ్రామానికి చెందిన భక్త అడారి(21) నీలకంఠ మఝి(23) లని వెల్లడించారు. ముగ్గురు మైనర్లను జేజే బోర్డ్‌లో హాజరుపరచినట్లు వెల్లడించారు. జగన్నాథ్ మఝి కొత్త సంవత్సరం దినాన వనభోజనాలకు వెళ్లి సాయంత్రం 4.30 గంటలకు తిరిగి వస్తూ గ్రామ సమీపంలో వాలీబాల్ ఆడుతున్న పిల్లల వద్దకు వెళ్లాడు. అక్కడ తగువులాడి వాలీబాల్ నెట్‌ను చింపి వేశాడు. నీలకంఠంను తిట్టాడు. ఆ తర్వాత గ్రామంలో బాలుడితో కలిసి పైన పేర్కొన్న ఇద్దరూ ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అకస్మాత్తుగా అక్కడకు జగన్నాఽథ్ వచ్చి ఒక నీలగిరి కట్టెతో వారిపై దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. దాంతో ఆగ్రహించిన వారంతా ఏకమై జగన్నాథ్ పై దాడిచేసి కర్ర లాక్కుని జగన్నాథ్‌ను తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బలకు జగన్నాథ్ సొమ్మ సిల్లి కిందపడిపోయాడని తెలిపారు. అతడిని విడిచి వారు వెళ్లిపోయారు. జగన్నాథ్ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతికారు. 2వ తేదీన కాయకూరల తోటలో జగన్నాథ్ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి అతడిని హాస్పిట్ తీసుకు వెళ్లగా అతడు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించినట్లు జగన్నాథ్ సోదరుడు సురేంధ్ర మఝి బిసింగపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశాడని పోలీసు అధికారి వెల్లడించారు. జగన్నాథ్ హత్య కేసులో ఆ ఐదుగురుని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తపశ్విణీ కుహార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment