రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
మల్కన్‌గిరి: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కోయిమేట్ల పంచాయతీ ఎం.పి.వి. 62 గ్రామం వద్ద శనివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. అతి వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పి గేదెను ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న గౌతమ్ మండాళ్ (27) ప్రాణాలు కోల్పోయాడు. గౌతమ్ మండాళ్ పోడియా సమితి ఉండ్రుకొండ పంచాయతీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు గౌతమ్ ది మల్కన్‌గిరి సమితి పద్మాగిరి పంచాయతీగా పోలీసులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే కలిమెల పోలీసు ఐఐసీ చంద్రకాంత్ తండి తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment