జంతువుల చర్మాలను రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు
జయపురం: వివిధ జంతువుల చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకున్నారు. సమాచారం తెలిసిన జయపురం సదర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని వారు ఆటోలో తీసుకువచ్చిన 80కి పైగా జంతువుల చర్మాలు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు సదర్ పోలీసు అధికారి ఈశ్ర తండ్రి శనివారం వెల్లడించారు. అరెస్టు అయిన వ్యక్తులు బొయిపరిగుడ సమితి రామగిరి పంచాయతీ కుట్రకుండ గ్రామానికి చెందిన కృష్ణదాస్ దొలాయి, చికాపూర్ పంచాయతీ సుందరజోడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అలబాన్ పంగిలుగా వెల్లడించారు. ఇరువురిపై కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నామన్నారు. జప్తు చేసిన జంతు చర్మాలను మెజిస్ట్రేట్ సమక్షంలో వాటిని పట్టణానికి దూరంగా ఉన్న డంప్ యార్డులో కాల్చివేసినట్టు పేర్కొన్నారు. పట్టుబడిన చర్మాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్టు పోలీసు అధికారి ఈశ్వర తండి వెల్లడించారు. శనివారం ఉదయం కొంతమంది వ్యక్తులు భూతనాధ్ శ్మశాన వాటిక మార్గంలో తిరుగుతున్నారు. ఆ సమయంలో ఒక ఆటో పంజియగుడ వైపు నుంచి వచ్చింది. ఆ ఆటో నుండి దుర్గంధం వస్తుండగా వారు అనుమానంతో ఆటోను అడ్డగించారు. ఆటో నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని జయపురం సదర్ పోలీసుకు తెలియజేసారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ శిరీష మహాపాత్రో, బరిణిపుట్ పోలీసు పండి అధికారి ఏఎస్సై కామాక్ష ప్రసాద్ బిశాయిలు సిబ్బందితో వచ్చి క్రిష్ణదాస్, అలబాన్‌లను అదుపులోకి తీసుకొని ఏమిటి తరలిస్తున్నారని నిలదీశారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానంతో ఆటోను పరిశీలించగా అందులో 80కి పైగా చర్మాలు ఉన్నట్లు గుర్తించారు. చర్మాలు ఎక్కడ నుంచి తీసుకొని వస్తున్నారని విచారించగా.. తాము కొనుగోలు చేసి జయపురంలోని ఓ వ్యక్తి వద్దకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. దీంతో ఆ ప్రాంతానికి జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర తండి, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన చేరుకొని నిందితులను విచారించారు. వెంటనే పశువైద్యాధికారిని రప్పించారు. పశువైద్యాధికారి తన సిబ్బదింతో వచ్చి జంతు చర్మాలను పరీక్షించేందుకు వాటి నమూనాలను సేకరించారు. మధ్యాహ్నం మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్ రాజకిశోర్ దాస్, తహసీల్దార్ సవ్యసాచి జెన, పోలీసు అధికారి ఈశ్వర తం సమక్షంలో చర్మాలను ముక్కలుగా చేసి వాటిని మొకాపుట్ డంప్ యార్డ్‌లో తగుల బెట్లారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ మహాపాత్రో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment