కిన్నెరుల హక్కులపై చైతన్య శిబిరం
జయపురం: సమాజంలో కిన్నెరుల (నపంసకులు)హక్కులపై కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు చైతన్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జయపురం సమితి గొడొపొదర్ పంచాయతీ డొమోపొడ గ్రామంలో కిన్నెరుల హక్కులపై చైతన్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి, లోక్ అదాలత్ శాశ్వత విచార పతి సుమన్ జెన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలకు కిన్నెరులకు లభించే చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. వారికి జన్మధ్రువ పత్రాలు, ప్రభుత్వం ద్వారా వారి లింగ పరిచయ పత్రాలు పొందే అధికారం కల్పించినట్టు చెప్‌ాపరు. చట్టపరంగా వారు లింగ పరివర్తన చేసుకొనే హక్కు కలిగి ఉన్నారని సుమన్ జెన వెల్లడించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలో ఉండే హక్కు సైతం ఉందన్నారు. అధికసంఖ్యలు కిన్నెరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment