గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్ గ్రీవెన్ సెల్, స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ బిజయ కుమార్ దాస్ వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు కెరండి, కత్తలకవిటి, సిద్ధమణుగు, రాణిపేట, పర్లాకిమిడి పురపాలక పరిధిలోని ప్రజలు హాజరై వినతులు అందించారు. ఈ వారం మొత్తం 57 వినతులు అందాయి. వీటిలో 47 వినతులను పరిశీలించి అక్కడికక్కడే కలెక్టర్ పరిష్కరించారు. స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, డీఆర్‌డీఏ ముఖ్యకార్వనిర్వాహణాధికారి గుణనిధి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, తహసీల్దార్ నారాయణ బెహారా, గుసాని సమితి బీడీవో గౌరచంద్ర పట్నాయక్ పాల్గొన్నారు.
జయపురంలో..
జయపురం: జయపురం సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన వాటిలో 27 వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు.. వాటిలో 19 వ్యక్తిగత, ఎనిమిది కమ్యూనిటీ వినతులు ఉన్నాయి. కొంతమంది ఆర్థిక సహాయం కోసం కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. బొరిగుమ్మ ప్రజలు చిట్‌ఫండ్ సంస్థపై ఫిర్యాదు చేశారు. జయపురంలో క్రికెట్ మైదానం సమకూర్చాలని సమాజ సేవకులు వినతి అందించారు. జయపురంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలని పాత్రికేయులు నరసింగ చౌదురి కోరారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ అధ్యక్షతన జరిగిన స్పందనలో జయపురం సబ్ కలెక్టర్ లక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, కొరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జిల్లా కేంద్ర ఆస్పత్రి అధికారి డాక్టర్ రబి నారాయణ మిశ్ర, జయపురం బీడీవో, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డవలప్‌మెంట్ ఇన్‌చార్జి ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ శక్తి మహాపాత్రో, జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన, జయపురం మున్సిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి కృతివాస సాహు, జిల్లా పంచాయతీ అధికారి జుగల కిశోర్ నాయిక్ , జిల్లా అర్బన్ డవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ దేవీ ప్రసాద్ డాలి, కొరాపుట్ సీఎస్‌వో సర్వేశ్వర నాయిక్, డీసీపీవో రాజేశ్వరీ దేవి, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శిరొధర ఖండపాణి, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విభాగ అధికారి చందన నాయిక్ ఉన్నారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌సెలన్‌ను సోమవారం నిర్వహించారు. ఈ వారం 28 వినతులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వీటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధన్, మల్కన్‌గిరి సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment