కళాశాల మైదానంలో సౌకర్యాలు కల్పించాలి
పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణచంద్ర గజపతి (స్వయం ప్రతిపత్తి) కళాశాల మైదానంలో విశ్రాంత షెడ్డు, తాగునీటి సౌకర్యం, శౌచాలయం, లైటింగ్ సౌకర్యం కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఎంపీ ప్రతినిధి దారపు రాజేష్ కుమార్ కోరారు. ఈ మేరకు బరంపురం ఎంపీ డాక్టర్ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహికి ఆదివారం వినతి పత్రం అందజేశారు. తొలుత ఎస్.కె.సి.జి.కళాశాల ప్రిన్సిపాల్‌కు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, ఇతరులు కలిసి ఉదయం, సాయంత్రం వ్యాయామానికి వెళ్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగులకు బ్యాటరీ ఆటో రిక్షాలు అందజేత
కొరాపుట్: దివ్యాంగులకు 13 బ్యాటరీ ఆటో రిక్షాలను ఉచితంగా అధికారులు అందజేశారు. నబరంగ్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజా ఫఇర్యాదుల పరిష్కార శిబిరంలో నబరంగ్‌పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో వీటిని పంపిణీ చేశారు. కాగా గ్రీవెన్స్‌లో 42 వినతులు అందినట్టు అధికారులు చెప్పారు. వీటిలో 37 వ్యక్తిగత, ఐదు సామూహిక వినతులు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం కలెక్టర్ అధికారులకు ఆదేశాలు పంపించారు. కార్యక్రమంలో ఏడీఎం మహేష్ చంద్ర నాయక్ పాల్గొన్నారు.
అమ్మో.. బర్డ్ ఫ్లూ
భువనేశ్వర్: రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తిస్తోంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ సంకేతాలు బలంగా తారసపడుతున్నాయి. పలు చోట్ల కాకులు ఇతరేతర పక్షులు మృతి చెంది నేలకు ఒరుగుతున్నాయి. పూరీ జిల్లా కృష్ణప్రసాద్ మండలంలో బర్డ్ ఫ్లూ భయంతో భయాందోళనలకు గురవుతున్నా రు. ఈ ప్రాంతంలో వివిధ కోళ్ల ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. మరికొన్ని చోట్ల కాకులు చనిపోతున్న సంఘటనలు బర్డ్ ఫ్లూ సంకేతాల్ని బలపరుస్తున్నాయి.
ఒడిశాలో హెచ్‌ఎంపీ వైరస్ జాడ లేదు: ప్రజారోగ్య శాఖ
భువనేశ్వర్: దేశంలో తాజాగా హెచ్‌ఎంపీ వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ వైరస్ ఛాయలు జాడలు రాష్ట్రంలో ఇంత వరకు తారస పడలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సోమవారం స్పష్టం చేసింది. హెచ్‌ఎంపీ వైరస్ నిర్వహణ పట్ల మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, కేంద్రం నుంచి మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంత వరకు హెచ్‌ఎంపీ వైరస్ జాడలు తారసపడలేదు. దగ్గు, జలుబు వంటి లక్షణాలను కలిగిన వారి నుంచి దూరం పాటించడం శ్రేయోదాయకమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ నీలకంఠ మిశ్రా తెలిపారు.
ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహికి వినతిని అందజేస్తున్న దారపు రాజేష్
Comments
Please login to add a commentAdd a comment