‘వేరే దారిలో జీతాలు సరికాదు’
జయపురం: సేవా పేపరు మిల్లు కార్మికులకు వేరే కంపెనీ నుంచి జీతాలు జమ చేయటం సరికాదని పేపరుమిల్లు కార్మిక యూనియన్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ మహంతి అన్నారు. సోమవారం స్థానిక యాధవ భవనంలో సేవా కార్మిక సంఘం, విశ్రాంతి కార్మిక సంఘ ప్రతినిధులు పేపరుమిల్లు ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. బసంత బెహర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రమోద మహంతి మాట్లాడుతూ 7 నెలల తర్వాత కార్మికులకు 2024 జూన్ నెల జీతం ఏఈజీ ఇన్‌ఫ్రాఅనే కంపెనీ నుంచి రావడం సబబుగా లేదన్నారు. ఇది అనైతికమని తెలిపారు. గత మార్చి నెల నుంచి కార్మికులకు పీఎఫ్ జమ కావడం లేదని తెలిపారు. దీనిపై ఈ నెల 4న లేబర్ కమీషనర్ కు మెమోరాండం సమర్పించామని వెల్లడించారు. కార్మికుల పీఎఫ్ లూటీ అయ్యిందని ఆరోపించారు. ఈ విషయం గత జూన్ నెలలో జయపురం సబ్ కలెక్టర్‌కు, లేబర్ కమిషనర్, మిల్లు యాజమాన్యానికి ఆదేశించారని తెలియజేశారు. ఈ విషయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసినట్లు మహంతి వెల్లడించారు. ఈ విషయాలన్ని పీఎఫ్ కమిషనర్‌కు వివరించేందుకు ఈ నెల 16వ తేదీన బరంపురం ఈపీఎఫ్ కమిషనర్ కార్యాలయం ముంగిట ధర్నా, ఆందోళన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కార్మిక నేతలు అలేఖ్ పాత్రొ, ప్రహ్లాద్ మల్లిక్, భాష్కర మిశ్ర, కేదార్ బెహర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment