బృందావన్ ప్యాలెస్‌లో 1985 బ్యాచ్ ‘బంధుమిలన్’
పర్లాకిమిడి: మహారాజా బాలుర ఉన్నత పాఠశాల 1985 టెన్త్‌క్లాస్ బ్యాచ్ బంధుమిలన్ ఆదివారం పర్లాకిమిడిలో ఘనంగా జరుపుకున్నారు. తమ పాత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ పాఠశాల ఆవరణలో ప్రార్థన జరిపి గురువులను కలుసుకున్నారు. అనంతరం బైకులపై బృందావన ప్యాలస్‌లో తమ గత స్మృతులు, ప్రస్తుత వివిధ ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న హోదాను తమ తోటివారితో పాలు పంచుకుని ఆనందంగా గడిపారు. దాదాపు 62 మంది పర్లాకిమిడి, విజయనగరం, భువనేశ్వర్, ఇతర పట్టణాల్లో స్థిరపడిన క్లాస్‌మేట్స్ కలుసుకుని బీఎల్ ప్యాలస్‌లో జరుపుకున్నట్టు శ్యామ సుందర గంతాయత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment