స్పందన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
రాయగడ: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హోటల్ స్వాగత్ లైన్‌లోని రామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో ఆదివారం ముగ్గుల పోటీలు జరిగాయి. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు వారి సంప్రదాయ సంక్రాంతి పండుగ నేపథ్యానికి సంబంధించిన అంశంపై నిర్వహించిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వర్షా టక్కర్, వందనా జోషిలు వ్యవహరించారు. మొదటి బహుమతిని చిన్నారి శైలజ, ద్వితీయ బహుమతిని ఐ.శిరీష, తృతీయ బహుమతిని బి.శిరీషలు సంపాదించుకున్నారు. అలాగే జి.ప్రవళ్లిక, జ్యోస్నా పాడిలు ప్రొత్సాహక బహుమతులను గెలుచుకున్నారు. విజేతలకు స్పందన సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరిప్రసాద్, కార్యదర్శి కె.కె.ఎంపట్నాయక్, పతివాడ తులసీ దాస్‌లు బహుమతులను ప్రదానం చేశారు. ఏటా సంక్రాంతిని పురస్కరించుకుని ఈ తరహా పోటీలను తమ సంస్థ నిర్వహిస్తుందని అన్నారు. మన భాష, సంస్కృతి, కళలను పరిరక్షించేందుకు సంస్థ విస్తృతంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment