సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలి
రాయగడ: మండీల వద్ద రైతుల నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి కుముడాబల్లిలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ధాన్యం మండీలను శనివారం ఆయన సందర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కుముడాబల్లి వద్ద మండీని ఏర్పాటు చేసినప్పటికీ, గత రెండు వారాలుగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి, పగలు ధాన్యం మండీల వద్ద తమ ధాన్యం బస్తాలు దొంగల పాలవ్వకుండా కాపలాగా ఉంటున్న ధీనావస్థలను తెలుసుకున్న ఎమ్మెల్యే వారిని పరామర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి రైతుల వద్ద నుంచి ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. అయితే ధాన్యం కొనేందుకు మిల్లర్లు మందుకు రాకపోవడంతో ఈ పరిస్థిఽతి వచ్చిందని ల్యాంప్ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగానికి సమాచారం తెలిపి తగు చర్యలు తీసుకుంటామని మండీ నిర్వహిస్తున్న అధికారులు సమాధానం చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment