సేవా పేపరు మిల్లు కార్మికులకు జీతాలు
జయపురం: దాదాపు 7 నెలల తర్వాత సేవా పేపరు మిల్లు కార్మికులకు 2024 జూన్ నెల జీతాలు వారి బ్యాంక్ ఖాతాల్లో శుక్రవారం జమయ్యాయి. అయితే ఆ జీతాలు కొత్త కంపెనీ ఏజీటీ పేరుతో జమ కావడం విశేషం. దీంతో మిల్లు కార్మికుల్లో ఆశలు చిగురించాయి. గత 2024 మే 30 నుంచి మదర్ అర్ధ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజీటీ అండ్ ఏఐఐ పేరుతో కొత్త బిజినెస్ ట్రాన్సఫర్ లేదా ఎంవోయూ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమ జీతాలు కొత్త కంపెనీ పేరుతో జమ కావడం వలన మిల్లు కొత్త కంపెనీ నడిపే అవకాశాలు ఉన్నట్లు కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక పాత బకాయిలు, పీఎఫ్, ఈఎస్‌ఐల విషయం ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై నుంచి మిల్లులో ఉత్పాదన నిలిచిపోయింది. అప్పటి నుంచి విశ్రాంత కార్మికులతో పాటు పర్మినెంట్ ఉద్యోగులకు జీతాలు లభించటం లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నాయి. కొత్త కంపెనీ ముందుగా వారి బకాయిలు చెల్లించాల్సి ఉంటుదని, అంతే కాకుండా మిల్లును పూర్తిస్థాయిలో నడిపేందుకు చర్యలు చేపట్టాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment