కనుల పండువగా..!
ముగిసిన చైతీ ఉత్సవాలు
చైతీ ఉత్సవ వేదిక ఏరియల్ వ్యూ
రాయగడలోని గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో కనుల పండువగా జరుగుతున్న చైతీ ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఈ ఏడాది సుమారు రూ.6 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాయగడ జిల్లా టూరిస్టు హబ్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. అనంతరం ముగింపు వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ ఫరూల్ పట్వారీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు.
– రాయగడ
Comments
Please login to add a commentAdd a comment