ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాల పరిశీలన
విజయనగరం అర్బన్: కురుపాం ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణ పనులను జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం గురువారం సందర్శించింది. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టడానికి గల సాధ్యాసాద్యాలను పరిశీలించామని ఈ సందర్భంగా వీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అకడమిక్ తరగతుల నిర్వహణకు కావాల్సిన భవన నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన నిర్మాణ పనులను అంచనా వేశామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారుల బృందంలో జేఎన్‌టీయూ జీవీ ప్రొఫెసర్ జి.జయసుమ, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్స్ అండ్ ఓఎస్‌డీ కురుపాం ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రొఫెసర్ కె.బాబులు, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్‌స్టిట్యూట్ రిలేషన్స్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.జె.నాగరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఆర్.గురునాథ్, యూనివర్సిటీ ఇంజినీర్ పి.వేణుగోపాలరావు, హరిప్రకాశ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment