మల్కన్‌గిరి: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవనానికి మరమ్మతులు చేపట్టాలని జాతీయ వికాస్ సేన ఒడిశా అధ్యక్షుడు కె.బాలరాజ్ కోరారు. ఈ మేరకు సీఎం మోహన్‌చరణ్ మాఝీని ఉద్దేశించి వినతిపత్రం కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌కు శుక్రవారం అందజేశారు. ఆస్పత్రి పైకప్పు, టైల్స్ ఊడిపోయి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనుకునే క్రమంగా ఇటువంటి పరిస్థితి దురదృష్టకరమన్నారు.
ఇప్పటికై నా నాయకులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనతో పాటు గంగాధర్ బడనాయిక్, హరి హంతాల్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment