ఔట్‌పోస్టు, సీసీ కెమెరాల నిఘా
పర్యాటకుల సందర్శనతో స్థానిక సాగర తీరం రద్దీగా తయారైంది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. మరో వైపు శ్రీ మందిరం పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. బీచ్‌లో పర్యాటకుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం పూరీ జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పర్యాటకుల భద్రత కోసం సముద్రంలో స్నానం చేసే సమయంలో ఆపత్కాల పరిస్థితుల్లో పర్యాటకులకు సహాయం చేయడానికి 120 మంది లైఫ్‌గార్డులు బీచ్‌లో వివిధ ప్రదేశాలలో నియమించారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో తనిఖీలు ముమ్మరం చేశారు. భారీ రద్దీ కారణంగా డిసెంబర్ మంగళ వారం (ఈ నెల 31) నుంచి పట్టణంలో వాహనాల రాకపోకల రద్దీ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. భువనేశ్వర్ నుంచి వచ్చే నాలుగు చక్రాల వాహనాలు జైల్ రోడ్ పార్కింగ్ వద్ద, కోణార్క్ నుండి వచ్చే నాలుగు చక్రాల వాహనాలు తొలొబొణియా పార్కింగ్ వద్ద, బ్రహ్మగిరి నుంచి వచ్చే నాలుగు చక్రాల వాహనాలు స్టెర్లింగ్ లేదా యాత్రిక పార్కింగ్ వైపు మళ్లించి వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment