భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని దేవస్థానంలో ఉదయం చోటు చేసుకున్న తోపులాట సంఘటన పోలీసు యంత్రాంగాన్ని చలింప జేసింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనల నివారణకు క్రమబద్ధీకరించిన వరుస విధానంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సందర్భంగా డీఐజీ సీఆర్ చరణ్ సింగ్ మీనా, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు వినీత్ అగర్వాల్ భక్తులు గుమిగూడే బొడొదండొ ఆవరణలో వరుస వ్యవస్థని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనల నివారణకు సంబంధించి అనుబంధ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
భక్తులకు దర్శన క్రమబద్ధీకరణ పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారుల బృందం
Comments
Please login to add a commentAdd a comment