నూతనోత్సాహం
రాయగడ:
నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకొన్నారు. పాత సంవత్సరానికి వీడ్కొలు చెబుతూ బుధవారం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పుర వీధుల్లో యువత సందడి చేశారు. ఆటపాటలతో ఆనందంగా గడిపారురు. పిక్నిక్ స్పాట్‌లు జనాలతో కిక్కిరిసి కనిపించాయి. రాయగడలోని హలువ, శంకేసు, తొలొగుమ్మ వంటి పిక్నిక్ స్పాట్‌లు రద్దీగా మారాయి. కుటుంబాలతో సహా వచ్చి సంతోషంగా గడిపారు.
మొక్కలతో శుభాకాంక్షలు..
జయపురం: కొత్త సంవత్సరాన్ని కొంతమంది వినూత్నంగా జరుపుకొన్నారు. గ్రీటింగ్ కార్డులు, మిఠాయిలు, బహుమతులకు బదులుగా జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ ఆదర్శ విద్యాలయంలో 8వ తరగతి విద్యార్థిని కృతిసాయిణి దొల బెహరా మొక్కలు బహుమతిగా ఇస్తూ నూతన సంవత శుభాకాంక్షలు తెలియజేసి ఆకట్టుకుంది. బొయిపరిగుడ సహిద్ లక్ష్మణ నాయిక్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా విద్యార్థిని అధ్యాపక సిబ్బంది మొక్కలు బహూకరించింది. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. తండ్రి, రామగిరి పంచాయతీ భల్లుగుడ ప్రాథమిక విద్యాలయం ఉపాధ్యాయుడు కనూచరణ బెహరా ప్రోత్సాహంతో వీటిని పంపిణీ చేసినట్లు విద్యార్థిని తెలిపింది. కార్యక్రమంలో సమితి సురక్ష అధికారి కార్తీక పాఢీ, కళాశాల అధ్యక్షులు స్నేహలత పట్నాయిక్, అధ్యాపకులు మానసీ ఆచార్య, కళాశాల చరిత్ర విభాగ అధ్యాపకులు హిమాంశు శేఖర బక్షీ, ఆంగ్ల విభాగ అధ్యాపకులు జ్యోతి పాఢీ తదితరులు పాల్గొన్నారు.
బొకేలకు గిరాకీ..
జయపురం: నూతన సంవత్సరం సందర్భంగా మార్కెట్‌లో బొకేలకు గిరాకీ ఏర్పడింది. పెద్ద ఎత్తున పూల అమ్మకాలు కొనసాగాయి. రాయపూర్, రాజమండ్రి నుంచి భారీగా పూలను తీసుకొచ్చి అమ్మకాలు సాగించినట్లు వ్యాపారులు వెల్లడించారు.
క్యాలెండర్ల ఆవిష్కరణ..
జయపురం: స్థానిక హనుమాన్ మందిర ప్రాంగణంలో మాధ్యమిక పాఠశాల ఉద్యోగుల సంఘం నేతలు నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ముందుగా హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. అనంతరం మాధ్యమిక పాఠశాలల ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణదాస్ హనుమాన్ క్యాలెండర్లను ఉద్యోగులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ సలహాదారు బృందావణ పండా, సుజాత మహాపాత్రో, కిశోర్ చంద్ర సాహు తదితరులు పాల్గొన్నారు.
రాయగడ:
ఇంటి ముందు
ముగ్గులతో
స్వాగతం
ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన యువత అధికారులు, ప్రజాప్రతినిధులకు
శుభాకాంక్షల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment