విషపూరిత పండ్లను తిని 12 మందికి అస్వస్థత
రాయగడ: అడవిలో లభించే విషపూరిత పండ్లను తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం చేసుకుంది. జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల బైరిగుడ ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థులు బడికి సెలవు ఇవ్వడంతో సమీపంలోని బైరిగుడ గ్రామంలోగల ఎవరి ఇంటికి వాళ్లు వెళుతున్నారు. ఈ క్రమంలో ఇందులొ 12 మంది విద్యార్థులు అడవిలో ఏవో పండ్లు తెంపి తిన్నారు. దీంతో వెంటనే వారికి కడుపు నొప్పి వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే వారి ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం వారికి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అవి విషపూరితమైన పళ్లు కావడంతో వాంతులు, కడుపు నొప్పి వంటివి వచ్చాయని తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. సమాచారం తెలుసుకున్న రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక స్థానిక ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment