28 ఏళ్ల తరువాత ఒకే వేదికపై..
జయపురం: జయపురం పురాతన చందనబెడ పాఠశాల 1996 మెట్రిక్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం బందుమిలన్ జరుపుకున్నారు. 28 ఏళ్ల తరువాత దేశ, విదేశాలతోపాటు వివిధ ప్రాంతాల లో ఉద్యోగ, వ్యాపార రీత్యా పని చేస్తున్న వారంతా జయపురం సమితి గొడొపోదర్ గ్రామ అడవిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకొరినొకరు ఆప్యాయంగా పలకరించుకు న్నారు. విద్యార్థి దశనాటి తీపి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తమ జీవితాలలో సాధించిన విజయాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకు న్నారు. అనంతరం వారంతా జయపురియ వంటకాలతో వనభోజనాలు చేశారు.
బందుమిలన్‌లో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది పూర్వ విద్యార్థు లు పాల్గొన్నారు. డాక్టర్ జగదీష్ బెహర, జగదీష్ రావు, లక్ష్మీ నారాయణ పాఢీ, లులు పండ, అరుణ బెహర, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment