డైనింగ్ రూమ్ ప్రారంభం
జయపురం: జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల డైనింగ్ రూమ్‌ను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గురువారం ప్రారంభించారు. రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ రూమ్‌లో విద్యార్థులతోపాటు ఎమ్మెల్యే కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పాఠశాల హెచ్‌ఎం ప్రకాశ్ పట్నాయక్, ఉపాధ్యాయులు దుర్గా పాత్రో, భగవాన్ సాబత్, విశ్వరంజన్ గౌడ, ప్రభాతీ పాణిగ్రహి, హితకర్ చరిడిదీపక్ సాహు, తన్బీర్ మహమ్మద్, నిర్మల తండిక, సౌమ్యరంజన్ పట్నాయక్‌తోపాటు పలువురు ఉపాధ్యాయులు భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులు డైనింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండేవారని, డైనింగ్ హాల్ ఏర్పాటు కావటంతో భోజనాలు చేసేందుకు సౌకర్యం ఏర్పడిందన్నారు. విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని హెచ్‌ఎంకు ఆదేశించారు. పాఠశాలలో రక్షిత తాగునీటి సౌకర్యం సమకూర్చాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment