ఉన్నత విద్యే లక్ష్యం
పర్లాకిమిడి: జిల్లాలో ఆదివాసీ వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యంగా బినోదినీ హైయ్యర్ సెకండరీ కళాశాల స్థాపించామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. గుమ్మాబ్లాక్ పద్మపురంలో వున్న బినోదినీ హైయ్యర్ సెకండరీ కళాశాల 27 వార్షికోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరై మాట్లాడారు. వార్షికోత్సవంలో డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి డాక్టర్ గుణనిధి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుమ్మా బ్లాక్ అధ్యక్షురాలు సునేమీ మండల్ తదితరులు హాజరయ్యారు. ఈ ప్లస్‌టూ కళాశాలను తన నాన్నమ్మ బినోదినీ పాణిగ్రాహి పేరున 1997లో ఆరుగురు విద్యార్థులతో ప్రారంభించారని, అందులో ఇప్పుడు 600 మందికి పైగా విద్యార్థులు పాస్‌అవుట్ అయ్యి బయటకు వెళుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ ఈ కళాశాలకు రూ.50 లక్షలతో స్మార్ట్ క్లాసులు, వైఫై అందజేశారని వారి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం వివిధ ఆటల పోటీలు, వక్తృత్వ, డ్యాన్సు, క్విజ్ పోటీలలో విజేతలకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలును అందజేశారు.
ఉన్నత విద్యే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment