![వారధి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07ors63-280071_mr-1738955819-0.jpg.webp?itok=Mttqyz_Q)
వారధి..
పర్యాటకానికి సారఽథి
జంఝావతి నదిపై నిర్మించిన హై లెవెల్ వంతెన
వంతెన పనులను సందర్శించిన ఆర్ అండ్ బీ శాఖ చీఫ్ ఇంజినీర్ దుర్గా ప్రసాద్ బెహర ఇటీవల పర్యటించి పరిశీలించారు. వంతెన పనులు సంతృప్తి కరంగా ఉండటంతో త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వంతెన పూర్తయినప్పటికీ అప్రోచ్ రొడ్డు పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందని అన్నారు. కొండలను దొలిచి రహదారిని నిర్మిస్తుండటంతో జాప్యం జరుగుతోందని వివరించారు. వంతెనపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. సెల్ఫీలు తీసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వంతెన పై ప్రమాదాల నివారణకు సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మజ్జిగౌరి మందిరానికి వచ్చే భక్తులు ఇక్కడకు వచ్చి సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉన్నందున ఇలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికి ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి రూ.19.47 కోట్లు ఖర్చు జరిగినట్లు సమాచారం.
![వారధి..1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07ors63b-280071_mr-1738955819-1.jpg)
వారధి..
Comments
Please login to add a commentAdd a comment