No Headline
రాయగడ: ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రగాయాలకు గురైన ఘటన జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధి గులుముండ గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందినవారు సమితి పరిధి ఒంపర గ్రామానికి చెందిన చైతన్య సబర్ (32), అతని భార్య మమిత సబర్ (28)లుగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గుణుపూర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం పర్లాకిమిడి రిఫర్ చేశారు.
● ఇటుకల లోడుతో వెళ్తుండగా...
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం గులుముండ సమీపంలోని ఇటుకల బట్టీ వద్ద ఇటుకలను ట్రాక్టర్‌లో లోడు చేసుకుని ఆరుగురు వ్యక్తులు గుణుపుర్ వస్తున్న సమయంలో గలుముండ వద్ద ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇటుకల కింద ఉండిపోయిన చైతన్య, మమితలు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం గుణుపూర్ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టరులో ప్రయాణించే వారందరూ గుణుపూర్ సమితి ఒంపర గ్రామానికి చెందినవారుగా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో గాయాలుపాలైనవారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు మృతి
మరో నలుగురికి గాయాలు
No Headline
Comments
Please login to add a commentAdd a comment