![పర్లా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07ors81-280031_mr-1738955818-0.jpg.webp?itok=C3IrptKA)
పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్
పర్లాకిమిడి:
గజపతి జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ స్వయం ఉపాధి, ఎన్.ఆర్.జి.ఏ. పథకాల కింద పనిచేస్తున్న గావ్ సాథీలు (మేట్స్) స్థానిక శ్రీజగన్నాథ మందిరం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఆర్.ఉదయగిరి, గుమ్మా, రాయఘడ సమితిల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. కలెక్టరేట్ వరకూ సాగిన ఈ ర్యాలీలో మహిళలు, గావ్ సాథీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గావ్ సాథీ మిళిత క్రియానుష్టాన్ సంఘం అధ్యక్షులు పోంచు నాయక్ మాట్లాడుతూ, గత బీజేడీ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేసినా పట్టించుకోలేదని, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో గావ్ సాథీలకు గౌరవ వేతనం, ఏడాదికి 300 రోజుల ఉపాధి కల్పన, దినసరి కూలీ రూ. 352, గావ్ సాథీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వంటి ప్రధాన సమస్యలతో వచ్చామని అన్నారు. గావ్ సాథీలు గత ఏడాదిన్నరగా పనులు లేక అనేక మంది పట్టణాలకు వలసపోయారని, రాయఘడ, ఆర్.ఉదయగిరి, గుమ్మా బ్లాక్‌లను వలసల మండలాలుగా గుర్తించాలని గావ్ సాథీ, మిళిత సంఘం కార్యదర్శి హాడియా భుయ్యాన్ అన్నారు. చివరకు జిల్లా ఎమర్జెన్సీ అధికారి ఆందోళన చేస్తున్న గావ్ సాథీల వద్దకు వచ్చి ముఖ్యమంత్రికి అడ్రస్ చేస్తూ రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో గావ్ సాథీ మిళిత సంఘాలు ఆందోళన విరమించారు.
![పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07ors81a-280031_mr-1738955818-1.jpg)
పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్
![పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07ors81b-280031_mr-1738955818-2.jpg)
పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్
![పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్3](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07ors81c-280031_mr-1738955819-3.jpg)
పర్లాకిమిడి కలెక్టరేట్ ఘెరావ్
Comments
Please login to add a commentAdd a comment