దివ్యాంగుల కోసం ’సుగమ్య యాత్ర’
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో దివ్యాంగులకు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, మార్కెట్‌ల వద్ద రెయిలింగ్, త్రిచక్రవాహనాలు వెళ్లడానికి ర్యాంప్స్ వంటివి ఏర్పాటు చేయాలన్న చిరకాల డిమాండ్‌కు కేంద్ర,రాష్ట్ర సామాజిక సురక్ష శాఖల అధికారులు సముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గజపతి కలెక్టరేట్ నుంచి ఐదు కార్లలో సమర్థ్ దివ్యాంగుల పునరావాస కేంద్రం అధ్యక్షులు సంతోష్ మహారాణా, సబ్‌డివిజనల్ సామాజిక సురక్షా అధికారి ఉత్సర్‌గీతా బోడోరయితో, తదితర సభ్య బృందం యాక్సిసబుల్ ఇండియా ప్రచారం సుగమ్య యాత్రను జిల్లా సామాజిక సురక్షా శాఖ అధికారి సంతోష్ కుమార్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 15 మంది సభ్యులు, పట్టణంలో ’సుగమ్య యాత్ర’ను శుక్రవారం నాడు చేపట్టారు. వీరు పర్లాకిమిడి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, ప్రైవేటు క్లినిక్‌లు, నేత్రాలయాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ తదితర కేంద్రాలను పరిశీలిస్తారు. ఈ సందర్భండా డీఎస్‌ఎస్‌ఓ సంతోష్ నాయక్ సాక్షితో మాట్లాడుతూ, ఈ సుగమ్య యాత్ర ద్వారా దివ్యాంగులకు ప్రతి చోటా వారికి సౌచాలయాలు, ర్యాంప్స్ నిర్మాణం, రెయిలింగ్ ఉండాలన్న నియమం కేంద్ర ప్రభుత్వం చట్టం ద్వారా కల్పించిందని, అందువల్ల వీటి ఆవశ్యకత దివ్యాంగులకు ఉందని అన్నారు. ఈ సుగమ్య యాత్రలో రాష్ట్ర దివ్యాంగుల పునరావాస కేంద్రం అధ్యక్షులు నిరంజన్ బెహారా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment