అడవుల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ అటవీ విభాగ రేంజ్ పరిధిలో చిత్రగుడ గ్రామంలో ఒడిశా ప్రభుత్వ అటవీ పర్యావరణం, జల వాయు పరివర్తణ విభాగం శుక్రవారం అడవులలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన శిబిరం నిర్వహించారు. అడవుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అందువల్ల అడవులు నష్టపోవటంతో పాటు పర్యావరణం కలుషితం అవుతోందని కొట్‌పాడ్ అటవీ రేంజర్ బిద్యుత్ బిశ్వాల్ వెల్లడించారు. సహజంగా అడవులలో ఎండా కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరగటం పరిపాటని అన్నారు. కొట్‌పాడ్ రేంజ్‌లో కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అడవిలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే అటవీ శాఖాధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో గిర్ల పంచాయతీ సర్పంచ్ జగమోహణ మఝి, వెట ర్నరీ అధికారి సత్యబ్రత సామంత రాయ్, ప్రభా కర నాయిక్,చైతన్య తండి, సుదీప్తి నాయిక్,సుశాంత మహాపాత్రో, జయంతి సాహులతో పాటు చిత్రగుడ, సింధిగాం, టెమర్‌గుడ, బైరాగి పొదర్, లామగుడ, హరదలి గ్రామాల కమిటీల సభ్యులు, వందలాదిమంది గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment