గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి
జయపురం: దేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుగొమ్ములని అవి ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందిన నాడే దేశం ప్రగతి సాధింస్తుందని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణిపతి అన్నారు. స్థానిక బ్లాక్ డవలప్‌మెంట్ కార్యాలయం(సమితి)లో బుధవారం వికశిత గ్రామం–వికశిత ఒడిశా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహణ మఝి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో జయపురంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ కన్న కలలు నిజం కావాలి అంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేందాలలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, క్రీడా, రహదారులు, రక్షిత తాగునీరు, సాగునీరు, తదితర మౌలిక సౌకర్యాలతోపాటు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమానికి జయపురం బీడీఓ శక్తి మహాపాత్రో అధ్యక్షత వహించారు. సమితి చైర్‌పర్సన్ తిలోత్తమ ముదులి, వైస్ చైర్మన్ గణేష్ పాడీ, జిల్లా పరిషత్ సభ్యులు రశ్మీరథ్, అస్థా నాయక్, ఏబీడీఓ మనోజ్ కుమార్ నాయక్, జీపీఈఓ భగీరథి నాయక్, సర్పంచ్‌లు కమళ లోచన గదబ, బొలిభద్ర పూజారి, సబిత నాయక్, బబుల దిసారి, శివ భూమియ, జయపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత నాయక్, కాంగ్రెస్ నేత దేవేంద్ర బాహిణీ పతి, మిషన్ శక్తి మహిళలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి
Comments
Please login to add a commentAdd a comment