శిశు సురక్షపై అవగాహన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ముఖ్యంగా గర్‌ల్స్‌పై అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులపై పర్లాకిమిడి, గుమ్మా, రాయఘడ, గుసాని, ఆర్.ఉదయగిరి బ్లాక్ కార్యాలయాల్లో గురువారం ఒక్కరోజు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదివాసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, మేట్రిన్స్‌కు శిశు సురక్షపై ఒక్కరోజు శిక్షణ శిబిరాన్ని ఆర్.ఉదయగిరి బ్లాక్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో జిల్లా సురక్షా సమితి అధ్యక్షుడు అశ్వినీకుమార్ మహాపాత్రో, జిల్లా శిశు సంరక్షణ అధికారి (డి.సి.పి.యు.) అరుణ్‌కుమార్ త్రిపాఠి, ఆర్.ఉదయగిరి బీడీఓ లారీమాన్ ఖర్సల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైక, తదతరులు పాల్గొని సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment