![ఘనంగా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ors81d-280031_mr-1738869641-0.jpg.webp?itok=LG_exzJd)
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
పర్లాకిమిడి: అతి పురాతన కృష్ణ చంద్ర గజపతి కళాశాలను విశ్వవిద్యాలయంగా గుర్తించేందుకు అసెంబ్లీలో ప్రతిపాదన లేవనెత్తుతానని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కృష్ణచంద్ర గజపతి (స్వయంప్రతిపత్తి) కళాశాల వార్షికోత్సవంలో ప్రకటించారు. గురువారం కళాశాల వార్షికోత్సవం నిర్వహించగా.. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బుధవారం రాత్రి కళాశాల వార్షికోత్సవం డాక్టర్ సత్యనారాయణ రాజ్‌గురు ఓపెన్ స్టేజీ వద్ద జరిగింది. ఇందులో గౌరవ అతిథులుగా సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, పండిత రఘునాథ పాత్రో, ప్రిన్సిపల్ డాక్టర్ జితేంద్రనాథ్ పట్నాయిక్, స్టూడెంట్స్ కల్చరల్ సెక్రటరీ రాధా కాంత భుయ్యాన్, ముఖ్యవక్తగా గోలాప్‌చంద్ర ఫిలిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు రామహారి కార్జి కళాశాల గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు అనేక రంగాల్లో సాధించిన విజయాలను చదివి వినిపించారు. ఈ కళాశాలను 1896లో అప్పటి మహారాజా స్వర్గీయ గౌరచంద్ర గజపతి నిర్మించగా, 1936లో ఆయన కుమారుడు శ్రీకృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ హైస్కూల్‌ను కళాశాలగా అప్‌గ్రేడ్ చేసినట్టు ప్రిన్సిపల్ జితేంద్రనాథ్ పట్నాయిక్ తెలిపారు. ఈ కళాశాలకు కేంద్రం నాక్ గ్రేడ్ సి గుర్తింపు ఇచ్చింది. ఈ ఆటోనమస్ కళాశాలను విశ్వవిద్యాలయం గుర్తింపు కోసం ఈ ప్రాంతపు పూర్వపు విద్యార్ధులు అనేక సార్లు ఆందోళన చేశారని ప్రిన్సిపల్ గుర్తుకు తెచ్చారు. ఈ కళాశాలలో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ అన్ని రంగాలలో విజయవంతం అవ్వాలని సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో కోరారు. అనంతరం పలు ఇంటర్నల్ గేమ్స్, వక్తృత్వ, డిబేటింగ్, స్పోర్ట్స్, డ్యాన్సు పోటీలలో విజయం సాధించిన వారికి షీల్డులు అందజేశారు. అనంతరం కళాశాల విద్యార్థినులు ఒడిస్సీ, సంబల్‌పురి డ్యాన్సులతో అలరించారు. అధ్యాపకులు సయ్యద్ అబ్దుల్ రెహామాన్ సభకు ధన్యవాదాలు తెలిపారు.
![ఘనంగా కళాశాల వార్షికోత్సవం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors81a-280031_mr-1738869641-1.jpg)
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
![ఘనంగా కళాశాల వార్షికోత్సవం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors81c-280031_mr-1738869641-2.jpg)
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
![ఘనంగా కళాశాల వార్షికోత్సవం 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors81b-280031_mr-1738869641-3.jpg)
ఘనంగా కళాశాల వార్షికోత్సవం
Comments
Please login to add a commentAdd a comment