పూరీ పరిరక్షణకు అండ
భువనేశ్వర్: విశ్వ విఖ్యాత పూరీ క్షేత్రం వారసత్వ విలువల పరిరక్షణతో బహుముఖ అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం అండగా నిలుస్తుందని చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా తెలిపారు. ఆయన నేతృత్వంలో రాష్ట్ర పర్యటన కొనసాగిస్తున్న ఆర్థిక సంఘం సభ్యులు పూరీ శ్రీ జగన్నాథ ఆలయం సందర్శించి పూజాదుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ రాజ్‌భవన్‌లో పూరీ మున్సిపాలిటీ అధికారులతో ఆర్థిక సంఘం ముఖ్యమైన సమావేశాన్ని కూడా నిర్వహించింది. ప్రాచీన ఆలయ నగరంలో ఆర్థిక కేటాయింపులు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర సౌకర్యాలను పెంపొందించే వ్యూహాలపై దృష్టి సారించాయి. సమావేశంలో పూరీ మున్సిపల్ అధికారులు పట్టణం డిమాండ్లని నొక్కి చెప్పారు. వీటిలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పవిత్ర నగరమైన పూరీకి పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు మద్దతుగా మెరుగైన మౌలిక సదుపాయాల ఆవశ్యకత వంటివి ప్రధానమైనవిగా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను సిఫారసు చేసేందుకు పరిశీలిస్తుందని ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ పనగరియా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం స్థానిక బ్లూ ఫ్లాగ్ సాగర తీరం సందర్శించింది. అనంతరం యునెస్కో ప్రపంచ వారసత్వ పర్యాటక కేంద్రమైన కోణార్క్‌లోని సూర్య దేవాలయం సందర్శించారు. రాజధాని నగరంలో కళా భూమి ప్రాంగణం సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.
పూరీ పరిరక్షణకు అండ
Comments
Please login to add a commentAdd a comment