![ఇద్దరు మోసగాళ్ల అరెస్టు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ors71a-280027_mr-1738869645-0.jpg.webp?itok=YwMstGCO)
ఇద్దరు మోసగాళ్ల అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పులిమెట్ల గ్రామంలో గురువారం బంగారం శుభ్రం చేస్తామని బీహార్‌కు చెందిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో కొద్ది రోజులుగా బంగారం శుభ్రం చేస్తామని ఓ ముఠా తిరుగుతోంది. బీహార్‌కు చెందిన విజయ్ సాహ(38), చందన్ కుమార్ సాహ(46) అనే ఇద్దరు సుశీల్ సర్కార్ అనే వ్యక్తి ఇంటికి జనవరి 29 వ తేదీన వెళ్లి వెండి, ఇత్తడి, బంగారం వస్తువులు శుభ్రం చేస్తామని చెప్పి ముందుగా.. వెండి ఇతర వస్తువులు శుభ్రం చేశారు. బంగారం ఉంటే ఇవ్వండని అడగడంతో సుశీల్ భార్య ఓ బంగారు గొలుసు ఇచ్చింది. తొలుత యాసిడ్‌తో కడిగినట్టు చూపించి ఓ తెల్లకాగితంలో చుట్టి అరగంట తర్వాత తీయాలని చెప్పి వారు వెళ్లిపోయారు. అరగంట పోయాక చూస్తే అందులో గొలుసు లేదు. మోసపోయామని గ్రహించాక మల్కన్‌గిరి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఐఐసి రీగాన్ కీండోకు ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు ఇద్దరూ పులిమేట్ల గ్రామంలో కనిపించడంతో గ్రామస్తులు దేహశుద్ధి చేసి కలిమెల పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి మల్కన్‌గిరి పోలీసులకు అప్పగించారు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి అమ్మేశారని చెప్పడంతో.. శ్రీనివాస్ అనే వ్యాపారి వద్దకు వెళ్లి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment