జయపురం: విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని ఉత్తమ నాగరికులుగా ఎదగాలని ఐటీఈఆర్ యూనివర్సిటీ భువనేశ్వర్ డీన్ డాక్టర్ రాజకుమార్ హొత్త సూచించారు. జయపురం నెహ్రూనగర్ తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న సిటీ ఉన్నత పాఠశాల క్రీడా ఉత్సవ పోటీల్లో విజేతల బహుమతుల ప్రదాన ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చదువుల్లో క్రీడలు ఒక భాగమని విద్యార్థులు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు బిరేస్ పట్నాయిక్ అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రధాన ఉత్సవంలో సిటీ హైస్కూలు కమిటీ అద్యక్షులు ఎ.శ్రీనివాస రావు, తెలుగు సాంస్కృతిక సమితి కార్యదర్శి వై.శ్రీనివాస ఖన్నా, సిటీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి.సుజాత, సిటీ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయిక్, వైస్ ప్రిన్సిపాల్ సుశ్మిత సాహు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ రాజకుమార్ హొత్త విజేతలకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా టెన్త్ విద్యార్థులకు ఫేర్‌వెల్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment