![మునిగుడలో గంజాయి స్వాధీనం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ors61-280071_mr-1738869645-0.jpg.webp?itok=hWmK9IIG)
మునిగుడలో గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని మునిగుడ రైల్వేస్టేషన్ వద్ద ఇద్దరు యువకులను ఆర్‌పీఎఫ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 32.500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిలో కందమాల్ జిల్లాకు చెందిన రుతుంగయా పోలీస్‌స్టేషన్ పరిధి ఉహాకియా గ్రామానికి చెందిన శ్రీధర్ మాలిక్, సిద్ధాంత్ మాలిక్‌లు ఉన్నారు. బస్టాండ్ నుంచి వీరిద్దరు గంజాయిని బ్యాగులో పెట్టుకొని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎప్పటిలాగే ఆర్‌పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment