![అవకాశ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ors60d-280071_mr-1738869640-0.jpg.webp?itok=16plBQfj)
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
క్రీడలూ చదువులో భాగమే
రాయగడ: అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచించారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా నిర్వహించారు. ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహిస్తోందని డీఐసీ జనరల్ మేనేజర్ బిజయ్ సాహు అన్నారు. జిల్లాలో ఎన్నో బృహత్తర పరిశ్రమలు ఉన్నాయని, టెక్నికల్ విభాగాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాయగడ కళాశాల ప్రిన్సిపాల్ బాబిలత షరప్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ బినయ్ కుమార్ బాసంతరాయ్, బిసంకటక్ ఐటీఐ ప్రిన్సిపాల్ ఆర్‌కే ప్రధాన్, బీఈవో సుదీప్త దాస్, రాయగడ సీటీటీసీ అధికారి సంతోష్ కుమార్ స్వయి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సందడి
జాబ్‌మేళాలో విద్యార్థుల సందడి కనిపించింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం జాబ్ అవకాశాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసింది. గోపాలపూర్ నుంచి వచ్చిన ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఆయా విభాగాలకు చెందినవారు వివరాలను వెల్లడించారు. ఆర్మీలో చేరేందుకు ఎక్కువ మంది యువతీ, యువకులు ఆసక్తికరంగా కనిపించి దరఖాస్తులు అందజేశారు. జాబ్‌మేళాలో జిల్లాలోని జేకే పేపర్ మిల్‌తో పాటు చిన్న, మధ్య తరహా కంపెనీలు పాల్గొన్నాయి.
కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు
![అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors60c-280071_mr-1738869640-1.jpg)
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
![అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors60-280071_mr-1738869640-2.jpg)
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
![అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors60a-280071_mr-1738869640-3.jpg)
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment