![పోలీస](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ors66-280071_mr-1738869603-0.jpg.webp?itok=7OEB3MGl)
పోలీసుల అదుపులో డొంగిరియా యువకులు
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి పరిధిలో గల నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న ముగ్గురు యువకులను బుధవారం అర్ధరాత్రి పొరుగు జిల్లా కలహండికి చెందిన పోలీసులు తీసుకెళ్లారు. యువకులను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, వారు చేసిన తప్పు ఏమిటన్న విషయాన్ని కూడా పోలీసులు వివరించకపోవడంతొ డొంగిరియా కొంధొ తెగకు చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లిన వారిని విడిచిపెట్టకపొతే 21వ తేదిన లంజిఘడ్ వేదాంత్ కంపెనీ ఎదుట భారీ ఎత్తున ఆందొళన చేపట్టనున్నట్లు డొంగిరియా సురక్షా సమితి లొద సికక హెచ్చరించారు. ఈమేరకు విలేకర్ల సమావేశంలో ఆయన వివరించారు. వివరాల్లోకి వెళితే.. నియమగిరి ప్రాంతంలో డొంగిరియా తెగకు చెందిన నియమరాజ ఉత్సవాలకు సంబంధించి ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వివిధ గ్రామాల్లో గల డొంగిరియా ప్రజలు చందాలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్శాలి పంచాయతీ పరిధిలో గల కునాకండు గ్రామానికి చెందిన సొన మాఝి, రెంగామాఝి, పలబెరి గ్రామానికి చెందిన పాత్ర మాఝి అనే ముగ్గురు యువకులు చందాలు వసూళ్లు చేయడానికి వెళ్తుండగా వారిని కలహండి పోలీసులు గురువారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలతో వారిని అరెస్టు చేసినట్లు సమాచారం.
![పోలీసుల అదుపులో డొంగిరియా యువకులు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors66a-280071_mr-1738869603-1.jpg)
పోలీసుల అదుపులో డొంగిరియా యువకులు
Comments
Please login to add a commentAdd a comment