నరసరావుపేట: ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కోనుగంటి యజ్ఞనారాయణరెడ్డి(62) అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లో మృతిచెందిన ఆయన భౌతిక కాయాన్ని స్వగృహానికి తీసుకొచ్చారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు సందర్శించి నివాళులర్పించారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైవీ సోదరుడు భద్రారెడ్డితో పాటు పలువురు డాక్టర్లు, రాజకీయ నాయకులు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అంతిమ యాత్రలో వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులోని స్వర్గపురి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పించిన వారిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలాని, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఓరుగంటి శేషిరెడ్డి, డాక్టర్ కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇంజినీర్ కొమ్మసాని కమలాకరరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment