గురజాల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. గురజాల నగర పంచాయతీ జంగమహేశ్వరపురానికి చెందిన చెన్నారెడ్డి బృందావనం గార్డెన్స్ కాలనీ నుంచి ద్విచక్ర వాహనంపై గురజాల పట్టణానికి బయలుదేరారు. ఈ సమయంలో ఎదురుగా గురజాల నుంచి అంబాపురం వెళ్తున్న ద్విచక్ర వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి తల డివైడర్‌కు తగిలింది. 108 వాహనం ద్వారా పిడుగురాళ్ల వైద్యశాలకు తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ చెన్నారెడ్డి మృతి చెందారు. దీనిపై గురజాల పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment