20 నుంచి భూముల రీసర్వే
నరసరావుపేట: రైతుల భూముల్లో ఈనెల 20 నుంచి రీసర్వే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గనోరే ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి రీ సర్వేకు సంబంధించి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రీ–సర్వే డెప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ అవగాహన కల్పించారు. పొరపాట్లకు తావు లేకుండా సర్వే చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలను వివరించారు.
నేడు స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్
ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్‌ను చేపడుతున్నట్టు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే వెల్లడించారు. శుక్రవారం ఈ కార్యక్రమంపై వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ’నూతన సంవత్సరం–పరిశుభ్రత ప్రారంభం’ నినాదంతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు.
జేసీ సూరజ్ గనోరే
Comments
Please login to add a commentAdd a comment